![]() |
![]() |

ప్రముఖ నటుడు మంచు మనోజ్ ప్రస్తుతం ఈటీవీ విన్ లో వస్తున్న ఉస్తాద్ టాక్ షో తో ముందుకు దూసుకుపోతున్నాడు. గెస్ట్ లని ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అలాగే ఆ షో ద్వారా ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించాడు. తాజాగా తన భార్య గురించి మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచాయి.
మనోజ్, భూమా మౌనిక లు గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మౌనిక ప్రెగ్నెంట్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన మనోజ్ బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ తో ఉన్న మౌనిక ఫోటోలని కూడా షేర్ చేసాడు. మౌనిక కూడా ఆ పిక్స్ ని తన ఇనిస్ట్రాగ్రామ్ లో షేర్ చేసి నా జీవితం నా పక్కన ఉండే వాళ్ళతో నన్నెప్పుడు ఆకర్షిస్తుంది, నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుందనే మాటల్ని కూడా క్యాప్షన్ గా ఉంచింది.అంతే కాకుండా మనోజ్ తన కొడుకు ధైరవ్ ని ట్యాగ్ చేసింది. దీంతో మనోజ్ పిల్ల పిల్ల నువ్వంటే ప్రాణమే అని రిప్లై ఇచ్చాడు.

ఇప్పుడు మౌనిక, మనోజ్ ల మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మౌనిక ప్రెగ్నెంట్ విషయం తెలుసుకున్న అభిమానులు అయితే మనోజ్ కి, మౌనిక కి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ ఇద్దరు కలిసి త్వరలోనే నమస్తే వరల్డ్ అనే బొమ్మల షాప్ ని కూడా ప్రారంభించబోతున్నారు.మనోజ్ నటించబోయే కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
![]() |
![]() |