![]() |
![]() |

`క్షణం` (2016), `అమీ తుమీ` (2017), `గూఢచారి` (2018), `ఎవరు` (2019) చిత్రాలతో కథానాయకుడిగా నాలుగు వరుస విజయాలను అందుకున్న మల్టిటాలెంటెడ్ అడివి శేష్.. త్వరలో `మేజర్`, `హిట్ః ద సెకండ్ కేస్` సినిమాలతో పలకరించబోతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ నిర్మాతగా రూపొందిన `మేజర్` జూన్ 3న జనం ముందుకు రానుండగా.. నేచురల్ స్టార్ నాని ఓ ప్రొడ్యూసర్ గా తయారైన `హిట్ః ద సెకండ్ కేస్` జూలై 29న రిలీజ్ కి రెడీ అవుతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన సయీ మంజ్రేకర్, మీనాక్షి చౌదరికి ఇవి మూడో చిత్రాలే. ఆ వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే `దబాంగ్ 3` (హిందీ), `గని` (తెలుగు)లో నటించిన సయీ మంజ్రేకర్ కి `మేజర్` కెరీర్ లో మూడో సినిమా కాగా.. `ఇచ్చట వాహనములు నిలుపరాదు`, `ఖిలాడి` చిత్రాల్లో సందడి చేసిన మీనాక్షి చౌదరికి కూడా `హిట్ః ద సెకండ్ కేస్` కెరీర్ లో మూడో ప్రాజెక్ట్. మరి.. తొలి రెండు చిత్రాలతో ఆశించిన విజయాలను అందులోకపోయిన సయీ, మీనాక్షి చౌదరి.. అడివి శేష్ సమేతంగా సక్సెస్ సొంతం చేసుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |