![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం `సలార్`. పాన్ - ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ యాక్షన్ సాగాలో ప్రభాస్ కి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. `కేజీఎఫ్`ని నిర్మించిన హొంబళే ఫిల్మ్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుండగా.. `కేజీఎఫ్` సంగీత దర్శకుడు రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ఈ సినిమాకి కూడా పనిచేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ భారీ బడ్జెట్ మూవీలో వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. తనది నెగటివ్ రోల్ అని టాక్. అదే గనుక నిజమైంతే.. ప్రభాస్, జగ్గూ భాయ్ కాంబినేషన్ లో వచ్చే మొదటి సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే `సలార్`లో జగపతి బాబు ఎంట్రీపై క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జగపతి బాబు చేతిలో `పుష్ప`, `గని` చిత్రాలున్నాయి. మరోవైపు `టక్ జగదీష్`, `రిపబ్లిక్`, `గుడ్ లక్ సఖి`, `మహా సముద్రం`, `లక్ష్య` సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీటన్నింటిలోనూ పొంతన లేని పాత్రల్లో కనిపించబోతున్నారు జగ్గూ భాయ్.
![]() |
![]() |