Home  »  News  »  దారుణం: డ్రింక్ లో మత్తుమందు.. ప్రముఖ నటిని రేప్ చేసిన 73 ఏళ్ళ దర్శకుడు

Updated : Aug 10, 2026

 


బాలీవుడ్ సినీ పరిశ్రమలో మరోసారి కాస్టింగ్ కౌచ్, మహిళపై లైంగిక వేధింపుల దారుణం తీవ్ర కలకలం రేపుతుంది. 'బడే దిల్ వాలా' (1999), 'జోరు కా గులామ్' (2000) వంటి క్రేజీ చిత్రాలను తీసి గుర్తింపు పొందిన 73 ఏళ్ల సీనియర్ దర్శకుడు, నిర్మాత షకీల్ నూరానీ. ఇప్పుడు ముంబై పోలీసులకి  చిక్కడం చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. దీంతో  సీనియర్ ఫిల్మ్‌మేకర్ ఎంతటి ఘాతుకానికి ఒడిగట్టాడో తెలిసి అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.  ఈ విషాదకర సంఘటన మూలాలు 2016 సంవత్సరం వరకు వెళ్తాయి.


 ముంబైలోని లోఖండ్‌వాలాలో జరిగిన ఒక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో  నటిగా స్థిరపడదామని అనుకున్నయువతీ, షకీల్ నూరానీ మొదటిసారి కలుసుకున్నారు. ఆ యువతికి తన రాబోయే కొత్త సినిమా ప్రాజెక్టులో మంచి అవకాశం ఇస్తానని నూరానీ మాట ఇచ్చాడు. ఆ నమ్మకంతోనే ఆ తర్వాతి రోజుల్లో ముంబై మాల్వానీ ప్రాంతంలో ఉన్న తన నివాసానికి స్క్రిప్ట్ చర్చల పేరుతో నూరానీ పిలిపించాడు. సినిమా చర్చల కోసం వెళ్లిన ఆ యువతి జీవితం అక్కడే ఊహించని మలుపు తిరిగింది.  కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టడమే కాకుండా, ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో సీక్రెట్‌గా రికార్డ్ చేశాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమెకు ఆ అసభ్యకరమైన వీడియోను చూపిస్తూ బెదిరింపులకు దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా లేదా కుటుంబ సభ్యులకు చెప్పినా ఈ ప్రైవేట్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని భయపెట్టాడు. ఈ విధంగా బ్లాక్‌మెయిల్ చేస్తూ గడిచిన 4 ఏళ్ల కాలంలో ఆమెపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.  

 

ఈ వేధింపులు కేవలం శారీరక దాడికే పరిమితం కాలేదు. గర్భనిరోధక మాత్రలు ముగించడం, ఆపై విషపూరిత పదార్థాలు కలిపిన ఆహారం తినిపించడం వల్ల ఆమె గర్భస్రావానికి గురైందనే  సంచలన విషయాలు బయటపడ్డాయి. వైద్య చికిత్స కోసం నటి ముంబై తిరిగి వచ్చిన తరువాత, దాదాపు 40 రోజుల క్రితం మాల్వానీ పోలీస్ స్టేషన్‌లో ధైర్యంగా ఫిర్యాదు నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే 73 ఏళ్ల షకీల్ నూరానీ పరారయ్యాడు.


Also read: Toxic: యష్ రిస్క్ చేస్తున్నాడా,బయటపడలేకపోతున్నాడా!

పోలీసులు మొదట ఆయన కుమారుడి అంధేరి లోఖండ్‌వాలా నివాసంలో సోదాలు చేసినా ఆచూకీ లభించలేదు. చివరకు సాంకేతిక ఆధారాల సహాయంతో ముంబైకి దాదాపు 200 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న మహాబలేశ్వర్ ఏరియాలోని ఒక ఫామ్‌హౌస్‌లో దాక్కున్నట్లు గుర్తించారు. శనివారం తెల్లవారుజామున రంగంలోకి దిగిన పోలీసులు నూరానీని అదుపులోకి తీసుకుని ముంబైకి తరలించారు.  నూరానీపై నూతన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 64(2)(m) (లైంగిక దాడి), 123 (విషప్రయోగం), 88 (అక్రమ గర్భస్రావం కలిగించడం) మరియు 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద  కేసులు నమోదు చేశారు. అనంతరం  బోరివలి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. సినిమా ఆశలతో వచ్చే నటీమణుల జీవితాలతో ఆడుకునే ఇటువంటి సంఘటనలు బాలీవుడ్ చీకటి కోణాన్ని మరోసారి బయటపెట్టాయి.

Shakeel Noorani, Malvani police station, Bollywood
  






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.