![]() |
![]() |
.webp)
శర్వానంద్(sharwanand)మామూలోడు కాదు. ఫ్యామిలీ, లవ్, మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ చేసుకుంటు వెళ్తుంటే డీసెంట్ హీరో అని అందరు అనుకున్నారు. కానీ తనలో కూడా రచ్చ రంబోలా చేసే కాండేట్ ఉన్నాడని చాటి చెప్తున్నాడు. కావాలంటే మీరే చూడండి.
శర్వానంద్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (uv creations)మూవీ కూడా ఒకటి. మొన్న మార్చి నెలలో శర్వా పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.అందులో రేసర్ గా కనిపించాడు. దాంతో శర్వా అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరు ఈ సారి శర్వా తన సత్తా చాటడం పక్కా అని భావించారు. ఇప్పుడు అందుకు తగ్గట్టే మేకర్స్ టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. రేస్ రాజా(race raja)అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. యూవీ అండ్ శర్వా కాంబోలో గతంలో రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు వంటి హ్యాట్రిక్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలో రేస్ రాజా మీద కూడా అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. బైక్ రేసింగ్ నేపథ్యంతో మూవీ తెరకెక్కుతుంది.

శర్వా కెరీర్ లో తెరకెక్కుతున్న 36 వ సినిమా ఇది.మాళవిక నాయర్ (Malvika Nair)హీరోయిన్ గా చేస్తుండగా అభిలాష్ కంకర దర్శకుడు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇక గత కొంత కాలంగా పరాజయాల బాటలో ఉన్న శర్వా కి ఈ విజయం చాలా అవసరం. రీసెంట్ గా మనమే తో ప్లాప్ అందుకున్నాడు.
![]() |
![]() |