![]() |
![]() |
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' (RRR). ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన ఎంతగా ఆకట్టుకుందో.. కథను మలుపు తిప్పే 'మల్లి' పాత్ర కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో అమాయకమైన గిరిజన బాలికగా కనిపించిన ఆ చిన్నారి, ఇప్పుడు అందాల భామగా మారిపోయి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
ఆ సినిమాలో మల్లి పాత్రలో అద్భుతంగా నటించిన ఆ అమ్మాయి అసలు పేరు ట్వింకిల్ శర్మ. గత కొన్నేళ్లలో ఈమె లుక్స్ లో ఎవరూ ఊహించని స్థాయిలో మార్పులు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు క్యూట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన ఈ బ్యూటీ, ఇప్పుడు స్టైలిష్ యంగ్ గర్ల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా ట్వింకిల్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోషూట్‌లో ఆమె బ్లాక్ స్లీవ్‌లెస్ టాప్, డెనిమ్ షార్ట్ స్కర్ట్ ధరించి ఎంతో స్టైలిష్‌గా దర్శనమిచ్చింది. ఒకప్పటి ఆ అమాయకత్వం స్థానంలో ఇప్పుడు అచ్చమైన సినిమా హీరోయిన్ కళ కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
నిజానికి 'ఆర్ఆర్ఆర్' సినిమా కంటే ముందే ట్వింకిల్ శర్మ పలు పాపులర్ కమర్షియల్ యాడ్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ యాడ్స్ లో ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి ముచ్చటపడిన దర్శకుడు రాజమౌళి, ఎంతో కీలకమైన మల్లి పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసుకున్నారు.
జక్కన్న నమ్మకాన్ని నిలబెడుతూ ఆ పాత్రలో ఆమె పండించిన భావోద్వేగాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులను కదిలించాయి. చిన్న వయసులోనే అంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్న చిత్రంలో నటించడం ఆమె కెరీర్‌కు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్‌గా మారింది.
ప్రస్తుతం ట్వింకిల్ శర్మ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు చూసి 'ఆర్ఆర్ఆర్ మల్లి అప్పుడే ఇంత పెద్దదైపోయిందా!' అంటూ ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. మోడ్రన్ దుస్తులలో ఆమె ఇస్తున్న స్టన్నింగ్ పోజులు చూస్తుంటే, భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అయ్యే అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె గ్లామరస్ లుక్స్ పలువురు ఫిల్మ్ మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.
చిన్న వయసులోనే రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ట్వింకిల్, ఇప్పుడు గ్లామర్ పరంగానూ అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇమేజ్ నుండి బయటకు వచ్చి, టాలీవుడ్ లో మెయిన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ 'మల్లి' కొత్త రూపం విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
![]() |
![]() |