Home  »  News  »  ఓజీ 2 లో ప్రకాష్ రాజ్ ఉంటాడా.. లేదంటే సత్య దాదాగా ఆ హీరో!

Updated : Jul 15, 2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan)వన్ మాన్ షో 'ఓజీ'(Og)సృష్టించిన సంచలనం తెలిసిందే. ముంబై అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కి, పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇటీవలే ఓజి సీక్వెల్ పనులు కూడా స్టార్ట్ కాగా పవన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తుండటం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'ఓజీ 2' (OG 2) సీక్వెల్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది.


 సీక్వెల్‌లో  ప్రకాష్ రాజ్ ఉంటాడా,లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మొదటి భాగంలో 'సత్య దాదా' అనే అత్యంత కీలకమైన క్యారక్టర్ ని  పోషించారు. కథ ప్రకారం ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) కి ఆశ్రయం ఇచ్చి, అతనికి ఒక గాడ్‌ఫాదర్‌లా నిలిచే క్యారక్టర్. అయితే ప్రకాష్ రాజ్ ని ఇప్పుడు పలురకాల కేసులు చుట్టుముడుతున్నాయి. ఒక వర్గం ప్రజలు కూడా ప్రకాష్ రాజ్ ని ద్వేషిస్తున్నారు. రాజకీయపరంగా కూడా పవన్, ప్రకాష్ రాజ్ మధ్య శత్రుత్వం పెరిగిపోయింది.దీంతో  'ఓజీ 2' లో సత్య దాదా రోల్ ని  కథా పరంగా ముగించేస్తారని లేదా మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, డైరెక్టర్ సుజిత్ కథ డిమాండ్ మేరకు ఒకవేళ ఆ క్యారక్టర్ కొనసాగించాల్సి వస్తే, ప్రకాష్ రాజ్ స్థానంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు సంజయ్ దత్‌ని  రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారట. 


Also read:  ఇది వాళ్ళ కోసమే తీసిన సినిమా

ఒకవేళ ఇదే నిజమైతే 'ఓజీ 2' లో సంజయ్ దత్ ఎంట్రీ ఓ జి' పై అంచనాలని 200 శాతం పెంచేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ ఏడాది నవంబర్ నుండి ప్రారంభం కానున్న 'ఓజీ 2' షూటింగ్ సమయంలో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. సుజిత్ ప్రస్తుతం ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో,సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ప్రకాష్ రాజ్ స్థానంలో కొత్త ట్విస్ట్‌లు చూడాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా 'ఓజీ 2' గురించిన ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది సోషల్ మీడియాని షేక్ చేయడం ఖాయం. 

pawan kalyan, prakash raj, og2, sujeeth






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.