Home  »  News  »  ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన రుక్మిణి వసంత్ 

Updated : Jul 15, 2026

 

రుక్మిణి వసంత్(Rukmini Vasanth).. సెల్యులాయిడ్ పై తను పెర్ఫార్మ్ చేస్తుంటే అందం, నటన పోటీపడుతూ ఉంటాయి. కాంతార చాప్టర్ 1 నే ఉదాహరణ. అందుకే అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందింది. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ నే తన స్టార్ స్టేటస్ కి ఉదాహరణ.ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ రుక్మిణి చెంతకు చేరినట్టుగా తెలుస్తుంది


సూపర్‌స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ ;ధర్మన్'. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో హై-వోల్టేజ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న  ఈ చిత్రంలో  రుక్మిణి వసంత్ ఫిక్స్ అయ్యింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో  అత్యంత కీలకమైన, కథని మలుపు తిప్పే శక్తివంతమైన క్యారక్టర్ లో కనిపించబోతుంది. ఇప్పటికే శరవేగంగా సాగుతున్న ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్‌లో రుక్మిణి వసంత్ అధికారికంగా అడుగుపెట్టారు. భారతీయ సినీ రంగంలోనే అగ్ర నటుడైన రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోవడంతో ఈ ముద్దుగుమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ మాత్రం అధికారకంగా ప్రకటన విడుదల చెయ్యలేదు.రుక్మిణితో పాటు సిమ్రాన్, రాశీ ఖన్నా కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.


also read: టాలీవుడ్‌ని ఊపేస్తున్న సీక్వెల్ ఫీవర్.. మెగాస్టార్, ఎన్టీఆర్, చరణ్, మహేష్ నెక్స్ట్ ప్లాన్స్ ఇవే!


ఫ్యామిలీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్' బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా  డిసెంబర్ 30న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ రజినీ సృష్టించబోయే సునామీని చాలా స్పషంగా చూపిస్తుంది.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.