![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప' వరల్డ్ వైడ్ గా ఘన విజయం సాధించిన సందర్భంగా డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(బన్నీ మామగారు) ఆధ్వర్యంలో బన్నీకి సన్మానం జరిగింది. శనివారం పార్క్ హయత్ హోటల్లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడం విశేషం.
బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' గతేడాది చివరిలో డిసెంబర్ 17 న విడుదలై ఘన విజయం సాధించింది. అంచనాలకు మించి నార్త్ లో కలెక్షన్స్ వర్షం కురిపించింది. తగ్గేదేలే అంటూ ఎక్కడ చూసినా పుష్ప మేనియా కనిపించింది. సినీ సెలబ్రిటీస్, క్రికెటర్స్ సైతం బన్నీ స్టెప్స్, మేనరిజమ్స్ తో సందడి చేశారు. ఇప్పటికే ఇంకా పుష్ప ఫీవర్ నుంచి జనాలు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పార్క్ హయత్ లో బన్నీ సన్నిహితులతో పార్టీ నిర్వహించగా.. అక్కడ ఆయనకు సన్మానం జరగడటం విశేషం.

ఈ కార్యక్రమానికి చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బిరామిరెడ్డి , భానుప్రకాష్ ఐఏఎస్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, క్రిష్, గుణశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ గజమాలతో సత్కరించారు.
![]() |
![]() |