Home  »  News  »  'ఆర్ఆర్ఆర్' వేడుక.. తారక్-చరణ్ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే

Updated : Mar 20, 2022

విడుదల తేదీ మార్చి 25 దగ్గర పడుతుండటంతో దేశవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించారు. 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం కర్ణాటకలో ఘనంగా జరిగింది. చిక్బల్లాపూర్లో జరిగిన ఈ వేడుకకి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక్, చరణ్ ల స్పీచ్ లు ఆకట్టుకున్నాయి. ఒకరి అభిమానులకి మరొకరు స్వాగతం చెబుతూ.. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని పిలుపునివ్వడం ఆకట్టుకుంది.

గతేడాది అక్టోబర్ లో గుండెపోటుతో మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి ఈ వేడుకలో నివాళులు అర్పించారు. ఈ వేడుకలో చరణ్ మాట్లాడుతూ.. " పునీత్ గారు మా కుటుంబసభ్యులు లాంటి వారు. ఆయన ఇప్పుడు లేరంటే నమ్మ బుద్ధి కావడం లేదు. నమ్మను కూడా. ఆయన లేని లోటుని శివన్న(శివ రాజ్ కుమార్) ద్వారా తీర్చుకుందాం. మా కోసం వచ్చిన తారక్ అభిమానులకి, నా అభిమానులకి థాంక్స్. మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఇలాగే ఉండాలి." అన్నారు. ఇక చివరిలో "ఇచ్చేద్దామా మైక్ తారక్ కి.. వెల్కమ్ తారక్" అంటూ చరణ్ తారక్ కి మైక్ ఇవ్వడం ఆకట్టుకుంది.

తారక్ మాట్లాడుతూ.. "పునీత్ గారు మనల్ని విడిచిపోలేదు. ప్రకృతి రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆయన లేరనుకొని మనం బాధపడకూడదు. ఆయనొక సెలబ్రేషన్. ఆయన చేసిన సినిమాలు, ఆయన చేసిన మంచి పనులతో ఆయనను సెలెబ్రేట్ చేసుకుందాం. ఆర్ఆర్ఆర్ అనేది కేవలం ఒక చిత్రం కాదు.. మా(తారక్, చరణ్) బంధం. ఆర్ఆర్ఆర్ అనేది ఒక చిత్రం కాదు.. తన చిత్రాల ద్వారా భారతదేశం యూనిటీ చాటుదాం అనుకుంటున్న గొప్ప దర్శకుడి కళ. మల్టీస్టారర్ సినిమాలకు కొత్త ఒరవడి. రామసేతు నిర్మాణంలో ఉడత సాయంలా.. ఇంత గొప్ప సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులు నా అభిమానులు. ఈ సినిమాతో నా బ్రదర్ చరణ్ అభిమానులు కూడా నాకు దక్కారు. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి.. మీరు ఎంత సఖ్యతతో ఉంటే అంత మంచి సినిమాలు వస్తాయి. చరణ్ ఫ్రెండ్ షిప్ నాకు జీవితాంతం తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను" అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.