![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిన 'డార్లింగ్' (Darling) తాజాగా 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, ప్రభాస్ బాక్సాఫీస్ ను స్టామినాను మరోసారి నిరూపించింది.
'డార్లింగ్' రీ-రిలీజ్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.7.59 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ అధికారికంగా పోస్టర్ ను విడుదల చేశారు.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా రూ.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా రూ.1.6 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ప్రభాస్ తన ఇలాకాలో తిరుగులేదని చాటుకున్నారు.

సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2010లో విడుదలైన డార్లింగ్ సినిమాను మళ్ళీ థియేటర్లలో చూసేందుకు యువత, ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడ్డారు. కరుణాకరన్ మార్క్ మేకింగ్, ప్రభాస్-కాజల్ కెమిస్ట్రీ, జి.వి. ప్రకాష్ అందించిన ఎవర్ గ్రీన్ సాంగ్స్ థియేటర్లలో మళ్ళీ మ్యాజిక్ చేస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేస్తున్న హంగామా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఉన్న అనేక రీ-రిలీజ్ రికార్డులను 'డార్లింగ్' అధిగమించింది. ప్రభాస్ నటించిన ఈ క్లాసిక్ ఎంటర్‌టైనర్, రీ-రిలీజ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
![]() |
![]() |