![]() |
![]() |

తనకంటే వయసులో చిన్నోడిని ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుంది. నిక్ జోనాస్ వయస్సు ప్రియాంక కంటే చాలా తక్కువ. ఆమె కంటే అతడు పదేళ్లు చిన్నోడు. ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కంటే అతడి భార్య అంజలి టెండూల్కర్ ఐదేళ్లు పెద్దది. పురాణాల్లోకి వెళితే... ఏకపత్నీవ్రతుడు రాముడి కంటే సీతాదేవి వయస్సు ఎక్కువ అని చెబుతారు. సో... వయసులో తమ కంటే చిన్న వాళ్ళ పై మహిళలు మనసు పారేసుకోవడం ఎప్పటి నుండో ఉంది. అందుకు శ్రుతిహాసన్ కూడా అతీతం ఏమీ కాదు.
తన కంటే వయసులో చిన్న వాడితో డేటింగ్ కి వెళ్లానని తాజాగా శృతిహాసన్ తెలిపింది. ఆ విషయం చెప్పుతూ చిన్నగా సిగ్గు పడింది కూడా! లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం ముంబైలో లో తన ఇంటిలోనే ఉంటోందామె. పెంపుడు పిల్లులతో ఆడుకోవడం, సోషల్ మీడియాలో లైవ్ స్టేషన్స్ నిర్వహించడం వంటివి ఆమె చేస్తోంది. మధ్య మధ్యలో తన జీవితంలో ఆసక్తికరమైన సంగతులను వెల్లడిస్తోంది.
![]() |
![]() |