Home  »  News  »  అజ్ఞాతవాసికి కాంట్రవర్సీలు మొదలు..?

Updated : Dec 18, 2017

సాధారణంగా సూపర్‌స్టార్ల సినిమాలు రిలీజ్ అయినప్పుడు అభిమానులతో పాటు మీడియా చేసే హడావిడి ఓ రేంజ్‌లో ఉంటుంది. కలెక్షన్లు, రికార్డులు, సెంటర్లు అంటూ ఎక్కువగా దీని గురించే మాట్లాడుకునే వారు. కానీ టీజర్లు, ట్రైలర్లు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాయో.. అప్పటి నుంచి సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే రికార్డుల కోసం కొట్టుకుంటున్నారు ఫ్యాన్స్. అలాగే ఫలానా సినిమా నుంచి కాపీ చేశారనో.. హీరో యాక్షన్ గత చిత్రాల మాదిరిగానే ఉందంటూ కొన్ని పెదవి విరుపులు కూడా వస్తుంటాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న "అజ్ఞాతవాసి" సినిమా విషయంలోనూ ఇప్పుడు ఇదే జరుగుతోంది.

ఈ మూవీ టీజర్‌ను గత శనివారం సాయంత్రం రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.. విడుదలైన 30 నిమిషాల్లోనే పది లక్షలకు పైగా వ్యూస్‌తో.. లక్షకు పైగా లైకులతో ఈ టీజర్ యూట్యూబ్‌ని షేక్ చేసింది. అయితే తమ ఫేవరేట్ స్టార్ టాప్‌లో ఉండాలని భావించిన కొంతమంది అభిమానులు.. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అజ్ఞాతవాసి టీజర్‌, తమిళ స్టార్ హీరో విజయ్‌ మెర్సెల్‌ సాధించిన లైకులు కన్నా ఎక్కువ సాధించిందని కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పిక్స్ పెడుతున్నారు. దీనిపై స్పందించిన ఇతర హీరోల అభిమానులు.. ఇదంతా ట్రాష్ అని అంటున్నారు. విజయ్ మెర్సెల్‌ 11 లక్షల లైకులతో అగ్రస్థానంలో ఉంటే.. రెండవ స్థానంలో అజిత్ వివేగం నిలిచింది.. ఇక అజ్ఞాతవాసి 4.46 లక్షలతో ముందుకు సాగుతోంది.

కొద్దిరోజులు వెయిట్ చేస్తే అజ్ఞాతవాసి రికార్డులు తెలుస్తాయి.. కానీ అప్పటి వరకు వెయిట్ చేయకుండా పవన్ ఫ్యాన్స్ అతిగా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇక టీజర్ ఓపెనింగ్ షాట్ అత్తారింటికి దారేది మాదిరిగా ఉందంటూ పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. "దేవ దేవం భజే సాంగ్‌"తో అత్తారింటికి దారేది స్టార్ట్ అవ్వగా.. అజ్ఞాతవాసిలో "మధురాపురి సదనా" అంటూ ప్రారంభమవుతుంది. యాక్షన్ సీక్వెన్స్, పవన్ హావభావాలు కూడా చాలా వరకు అత్తారింటికి దారేదిని పోలీ ఉన్నాయంటున్నారు క్రిటిక్స్. ఇక ఆ సినిమాలో నదియా పాత్ర ఎంతో కీలకమైనది... ఆమె లేకపోతే ఆ సినిమాకి అర్థమే లేనంతగా ఆ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దాడు త్రివిక్రమ్. ఇక అజ్ఞాతవాసిలోనూ ఖుష్భూది అలాంటి పాత్రే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అది అత్తా, అమ్మా, అక్కా లేక మరొకటా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సేందే. ఇప్పటి వరకు అజ్ఞాతవాసి విషయంలో వినిపిస్తున్న వాదనలు ఇవి.. మరి సినిమా రిలీజ్‌కు సమయం ఉండటంతో ఈ లోగా ఇంకెన్నీ వినిపిస్తాయో వేచిచూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.