![]() |
![]() |

తెలుగు నాట ఆడియో రిలీజ్ ఫంక్షన్లు జరిగి ఏళ్లు అవుతోంది. పాటలను ఏ ఎఫ్.ఎం ద్వారానో.. ఆన్లైన్లోనో రిలీజ్ చేసేసి.. సినిమా విడుదలకు పది, పదిహేను రోజుల ముందు ప్రీ-రిలీజ్ ఈవెంట్ పేరుతో గ్రాండ్‌గా సెలబ్రెట్ చేస్తూ వస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే నేను ట్రెండ్ ఫాలో అవుతా.. సెట్ చేయను అంటున్నాడు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. ఆయన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బదులుగా ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తున్నారు.
రెండు పాటలు ఆన్లైన్లో రిలీజ్ చేసినా.. మిగిలిన పాటలను వేడుకలోనే వదలనున్నారు. ఈ నెల 19న హైదరాబాద్ హైటెక్స్‌లో దీనికి సంబంధించి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిర్ణయంతో ఇప్పటి దాకా నడిచిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లను పక్కనబెట్టి మిగిలిన హీరోలు కూడా.. పవన్ దారిలో ఆడియో వేడుకలకి పచ్చజెండా ఊపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది పవన్ అభిమానులే. ఒకరు ఆ దిశగా అడుగులు వేస్తే.. మిగిలిన వారు ఆటోమేటిగ్గా అటే నడుస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ.
![]() |
![]() |