![]() |
![]() |

అక్కినేని కుటుంబంలోకి కోడలుగా ఈ మధ్యే కాలు పెట్టింది సమంత. వచ్చి రాగానే, తన పేరుని సమంత రుత్ ప్రభు నుండి సమంత అక్కినేని గా మార్చుకొని... తద్వారా తాను కుటుంబానికి ఎంత విలువనిస్తుందో చెప్పకనే చెప్పింది. పెళ్లి అయిన కొద్దీ రోజులకే మామ నాగార్జునతో కలిసి రాజు గారి గది 2 ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంది. సమంతకి వర్క్ పైన అంత డెడికేషన్ కాబట్టే, నాగార్జున కి కోడలు అంటే అమితమయిన అభిమానం. నాగ్ సమంతని కోడలుగా కాకుండా కూతురిగా చూసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. ఇంకా చెప్పాలి అంటే, సమంత తో అక్కినేని కుటుంబానికి మనం తో విడదీయరాని బంధం ఏర్పడింది. నాగ్, సామ్ లని స్క్రీన్ మీద చూసిన ప్రతి ఒక్కరు మెస్మరైజ్ అయ్యారనే చెప్పొచ్చు. అయితే, ఒక విషయంలో నాగార్జునకి చెమటలు పట్టిస్తున్నారట భార్య అమల, కోడలు సమంత. అమల అంటే నాగార్జునకి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇంటి బాధ్యత మొత్తం అమల చేతుల్లోనే ఉంటుంది. కొద్ది కాలంలోనే అమల, సమంత మంచి ఫ్రెండ్స్ అయ్యారట. ప్రతి సంవత్సరం అమల తన ఫామిలీ కి, ఫ్రెండ్స్ కి క్రిస్మస్ రోజున గ్రాండ్ పార్టీ ఇస్తుంది. స్వతహాగా క్రిస్టియన్ అయిన సమంత కూడా ఈసారి తన అత్తారింట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయడానికి నిర్ణయించుకుందట. మరి, భార్యకి, కోడలికి సమ ప్రాధాన్యతనిచ్చే నాగార్జున ఏ పార్టీ కి వెళ్లాలో తెలియక సతమతమయ్యాడట. అయితే, ఇద్దరినీ సంతృప్తి పరిచేలా పార్టీ టైమింగ్స్ వేరేలా ఉండేలా చూసుకోమ్మన్నాడట. నాగార్జునా మజాకా!
![]() |
![]() |