![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేస్తోన్న సినిమాల్లో OG ఒకటి. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా వీడియో గ్లింప్స్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్‌ను డైరెక్టర్ మాఫియా కింగ్‌గా ఆవిష్కరించిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సినిమాపై అప్పటికే ఉన్న అంచనాలు నెక్స్ రేంజ్‌కి చేరుకున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని పవర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో OG సినిమా కథే ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న వార్తల మేరకు.. ముంబాయికి టూరిస్ట్ గైడ్‌గా వచ్చిన ఓ యువకుడు అనుకోని పరిస్థితుల్లో అక్కడున్న మాఫియాను ఎదిరించి పెద్ద డాన్‌గా ఎదుగుతాడు. అక్కడున్న వారందరికీ వణుకు పుట్టిస్తాడు. ఈ వార్‌లో అతను తన కుటుంబాన్ని కూడా పోగొట్టుకుంటాడు. తర్వాత కొన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతాడు. పదేళ్ల తర్వాత కొన్ని సిట్యువేషన్స్‌లో మళ్లీ అతను ముంబైలో అడుగు పెట్టి తన కుటుంబాన్ని హతమార్చిన వారిపై పగ తీర్చుకోవటమే కథ అని అంటున్నారు. OG కథ ఇదేనంటూ వార్తలు వైరల్ అవుతోన్న నేపథ్యంలో.. ఇదేంటి రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో అర్జున్ కథ చెబుతున్నావ్ అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం సుజిత్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందుకు రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో OG సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్‌కు జతగా కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. మరో వైపు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నారు. మరో వైపు క్రిష్ సైతం హరి హర వీర మల్లును పూర్తి చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
![]() |
![]() |