![]() |
![]() |

కోలీవుడ్‌కి చెందిన వెర్సటైల్ యాక్టర్ ధనుష్ సినిమాలకు ఇటు సౌత్‌లోనూ అటు నార్త్‌లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు అప్పుడప్పుడు బాలీవుడ్ సినిమాల్లోనూ ఆయన నటిస్తుంటారు. ఈ కోవలో ధనుష్ వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ఆ లిస్టులో ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్షన్లో చేయబోతున్నతేరే ఇష్క్ మే సినిమా ఉంది. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో రాంజానా, అత్రంగి రే సినిమాలు రూపొందాయి. ఆ రెండు సినిమాలు మంచి విజయాలను సాధించాయి. దీంతో తేరే ఇష్క్ మే మూవీపై మంచి ఎక్స్‌పెక్టెషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
లేటెస్ట్ సినీ సర్కిల్స్ సమాచారం మేరకు ఈ మూవీలో ధనుష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె నటించబోతున్న తొలి కోలీవుడ్ సినిమా ఇదే అవుతుంది. అయితే దీన్ని తమిళంతో పాటు తెలుుగు, హిందీ భాషల్లోనూ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో మూవీ తెరకెక్కనుంది. నవంబర్‌లో సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసి మూడు నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జూన్‌లో విడుదల చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
ధనుష్ ఇప్పుడు తన 50వ సిినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆమూవీలో హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. దీని తర్వాత 51వ సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయబోతున్నారు. మరో వైపు కియారా అద్వానీ.. రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది.
![]() |
![]() |