![]() |
![]() |

కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ తాజా చిత్రం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనుంది. సెట్స్‌లోకి ఇంకా విజయ్ అడుగు పెట్టలేదు. ఆయన ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. మాస్ ఇమేజ్ ఉన్న హీరో కావటంతో దళపతి 68పై అందరి దృష్టి ఉంది. తాజా సమాచారం మేరకు ఇందులో బాలీవుడ్ స్టార్ ఒకరు కీలక పాత్రలో నటించబోతున్నారట. వారెవరనే దానిపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తో్న్న సమాచారం మేరకు ఆమిర్ ఖాన్ లేదా షారూఖ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు దీన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలనుకుంటున్నారట. ఇప్పటి వరకు తమిళ ఇండస్ట్రీకే పరిమితమైన విజయ్.. ఇప్పుడిప్పుడే తెలుుగ మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
సౌత్ నుంచి చాలా మంది అగ్ర కథానాయకులు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దళపతి విజయ్‌ని పాన్ ఇండియా లెవల్లో ప్రొజెక్ట్ చేయటానికి వెంకట్ ప్రభు నిర్ణయించుకుని ఆ దిశగా సినిమాను ముందుకు తీసుకెళుతున్నారట.ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారు. వారిలో ఒకరు ప్రియాంక అరుల్ మోహన్ కాగా.. మరో హీరోయిన్‌గా సిమ్రాన్‌ను తీసుకోవటానికి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.
మరో వైపు విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన లియో సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న సినిమా ఇది. ఇందులో త్రిష కథానాయికగా కనిపించనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను భారీ లెవల్లో విడుదల చేయబోతున్నారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు పీక్స్‌లో ఉన్నాయని, విజయ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అవుతుందని కోలీవుడ్ సర్కిల్స్ అంటున్నాయి.
![]() |
![]() |