![]() |
![]() |
.webp)
ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తం మీద గోల్డెన్ లెగ్ హీరోయిన్ ఎవరని అడిగితే అందరు ఏకతాటిపై నిలబడి శృతి హాసన్ పేరు చెప్తారు.ఆమె ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్.అంతెందుకు ఐటెం సాంగ్ చేసినా గెస్ట్ అప్పీరియల్ చేసినా చాలు ఆ సినిమా హిట్. తాజాగా తన కెరీర్ కి సంబంధించిన సీక్రెట్ ఒక దాన్ని ఆమె బయటపెట్టింది.
హీరోయిన్ గా ఒక మూవీలో మెయిన్ రోల్స్ లో మెరిసినా లేక అతిథి పాత్రల్లో నటించినా ఆ పాత్రకు న్యాయం చేసేందుకు వందశాతం శ్రమిస్తానని చెప్పింది.అంతే కాదు తను ఇన్నాళ్లు సినిమా ఫీల్డ్ లో రాణించడానికి గల కారణాన్ని కూడా ఆమె చెప్పింది. సినిమా కోసం కష్టపడి పనిచేయడమే నాకిష్టం. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా అలసిపోయి ఇంటికి వెళ్లడం కంటే మంచి అనుభూతి మరొకటి లేదు.ఒక వేళ అలా అలసిపోయిన అనుభూతిని పొందటం లేదంటే అది నాకు చెత్త అనుభవంగా అనిపిస్తుందని కూడా చెప్పుకొచ్చింది.సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలని చూసిన చాలా మంది శృతి హాసన్ కి ఉన్న వర్క్ డెడికేషన్ గురించి మెచ్చుకుంటున్నారు.

లోక నాయకుడు కమల్ హాసన్ కూతురు స్థాయి నుంచి శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ అనే స్థాయికి ఆమె ఎప్పుడో ఎదిగింది. లేటెస్ట్ గా సలార్ తో మంచి గుర్తింపుని పొందిన శృతి ప్రస్తుతం అడవి శేష్ తో డెకాయిట్ అనే మూవీలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది.
![]() |
![]() |