![]() |
![]() |

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అంత్యక్రియలు రేపు మద్యాహ్నం జరిగే అవకాశముంది. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచారు. ఈ క్రమంలో ఆయనకు నివాళులు అర్పించడానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు పెద్ద ఎత్తున కదిలారు.

కృష్ణం రాజుకి నివాళులు అర్పించిన వారిలో కృష్ణ, చిరంజీవి, రాఘవేంద్రరావు, మోహన్ బాబు, అశ్వనీదత్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, దిల్ రాజు, త్రివిక్రమ్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ తదితరులు ఉన్నారు. పెదనాన్న కృష్ణంరాజును ఎంతగానో అభిమానించే ప్రభాస్.. ఆయన మృతితో తీవ్ర బాధలో ఉన్నారు. నివాళులు అర్పించడానికి వస్తున్న ప్రముఖులు భౌతికకాయం వద్ద ఉన్న ప్రభాస్ ను పరామరిస్తున్నారు.

కృష్ణంరాజుతో 50 ఏళ్ళ స్నేహం ఉందని, ఎన్నో సినిమాల్లో కలిసి నటించమని, ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లడం బాధగా ఉందని కృష్ణ అన్నారు.

నా కెరీర్ తొలినాళ్ళ నుంచి నన్ను పెద్దన్నలా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారు లేని లోటు ఎప్పటికీ తీరనిది అని చిరంజీవి అన్నారు.

కృష్ణం రాజు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని, ఆయన మృతితో సినీ పరిశ్రమ పెద్ద దిక్కుని కోల్పోయిందని బాలకృష్ణ అన్నారు.

నాగార్జున, వెంకటేష్, నరేష్ తదితరులు కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
![]() |
![]() |