Home  »  News  »  OTT Releases: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం చూడాల్సిన క్రేజీ సినిమాలు, సిరీస్ లు ఇవే!

Updated : Mar 27, 2026

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్-2' హవా కొనసాగుతోంది. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల తాకిడి లేదు. చిన్న సినిమాలే విడుదలయ్యాయి. దాదాపు ఆ సినిమాలన్నీ పరవాలేదనే టాక్ కే పరిమితమయ్యాయి.

ఈ వారం బ్యాండ్ మేళం, సుయోధనతో పాటు డబ్బింగ్ సినిమాలు యూత్, హ్యాపీ రాజ్ థియేటర్లలో అడుగుపెట్టాయి. వీటిలో సుయోధన సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, మిగతా మూడు సినిమాలు రొమాంటిక్ డ్రామా జానర్ లోనే రూపొందడం విశేషం    

ఓటీటీలో మాత్రం జానర్లలో పలు సినిమాలు, సిరీస్‌లు సందడి చేస్తున్నాయి.

ఓటీటీలో సందడి చేస్తున్న సినిమా/సిరీస్‌లు:
హే బల్‌వంత్‌ (Hey Balwanth) - ZEE5: సుహాస్, నరేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ కామెడీ డ్రామా మార్చి 27 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రి నడిపే బిజినెస్ వెనుక ఉన్న అసలు రహస్యం కొడుకుకు తెలిస్తే ఏం జరుగుతుందనేదే ఈ కథ.

సంప్రదాయని సుప్పిణి సుద్దపూసని - ETV Win: శివాజీ, లయ జంటగా నటించిన ఈ క్రైమ్ కామెడీ డ్రామా మార్చి 26 నుండి అందుబాటులోకి వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ చాలా కాలం తర్వాత మళ్ళీ రిపీట్ కావడం విశేషం.

ముత్తు అలియాస్ కాట్టాన్ (Muthu Alias Kaattan) - JioHotstar: విజయ్ సేతుపతి నటించిన ఈ పక్కా విలేజ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా మార్చి 27 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

డేర్ డెవిల్: బోర్న్ ఎగైన్ సీజన్ 2 - JioHotstar: మార్వెల్ ఫ్యాన్స్ కోసం ఈ పాపులర్ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది.

వలతు వశతే కల్లన్ (Manorama Max): ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ మలయాళ డబ్బింగ్ మూవీ థ్రిల్లర్ లవర్స్ కు బెస్ట్ ఛాయిస్.

రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ (Netflix): పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాణి ముఖర్జీ, మరోసారి శివానీ శివాజీ రాయ్ పాత్రలో ‘మర్దానీ 3’ తో అలరించేందుకు వచ్చేశారు. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మూడు నెలల కాలంలోనే 93 మంది అమ్మాయిలు మిస్ అయిన కేసును శివానీ ఎలా చేధించింది? హ్యూమన్ ట్రాఫికింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సాగుతుంది.

షాహిద్ కపూర్ ‘ఓ రోమియో’ (Amazon Prime Video): షాహిద్ కపూర్, విశాల్ భరద్వాజ్ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రం ‘ఓ రోమియో’. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. 1990ల నాటి ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్‌లో షాహిద్ కపూర్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపించగా, తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకునే మహిళగా త్రిప్తి డిమ్రి నటించింది. 

మొత్తానికి ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల సందడి ఉంటే, ఓటీటీలో మాత్రం పలు సినిమాలు, సిరీస్ లతో మెగా జాతర కనిపిస్తోంది. సస్పెన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా ప్రతి జానర్ లోనూ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.