Home  »  News  »  Samantha: మహిళలంటే చిన్నచూపు, సమానత్వం లేదు..  క్షమాపణలు చెబుతున్నాం

Updated : Mar 27, 2026

 

 

-సమంత స్పీచ్ వైరల్ 
-మన శక్తీ మనకి తెలియడం లేదు 
-రాజ్ నిడిమోరు  ప్రస్తుతం ఏం చేస్తున్నాడు

సినిమా అనే బలమైన ఆయుధం ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులలో సుస్థిర స్థానాన్ని పొందిన సమంత(Samantha)కొన్ని నెలల క్రితం దర్శకుడు 'రాజ్ నిడిమోరు'(Raj Nidimoru)ని పెళ్లి చేసుకొని లైఫ్ లో కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ తో జీవితం బాగుందని ఇప్పటికే చాలా సార్లు వెల్లడి చేసిన సమంత రీసెంట్ గా సినిమా వార్తలని ప్రచురించే ప్రముఖ మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'(The Hollywood reporter India)ఏర్పాటు చేసిన ఉమెన్ ఇన్ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమంలో పాల్గొంది. సదరు కార్యక్రమంలో సమంత చెప్పిన మాటలు ఇప్పుడు తెలుగుతో పాటు సౌత్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరి తను ఏం మాట్లాడిందో చూద్దాం.

సమంత మాట్లాడుతు మహిళా క్యారెక్టర్స్ కేవలం హీరోకు మద్దతుగానో, ప్రేరణ ఇచ్చే వాటిగానే  పరిమితం కాకుండా, నిజ జీవితంలోని క్లిష్టమైన మనస్తత్వాలను ప్రతిబింబించేలా ఉండాలి. షూటింగ్ లొకేషన్లలో మహిళా కళాకారుల భద్రత ఒక చర్చాంశం కాకూడదు. ఇండస్ట్రీలో అదొక అత్యంత ఖచ్చితత్వంగా ఉండాలి. మహిళా ప్రధాన చిత్రాలని ఫీమేల్ లీడ్ క్యారక్టర్ లో చూడకుండా వాటిని కూడా కథలాగే పరిగణించే రోజు రావాలి. మహిళలు ఎవరి ప్రశంస కోసమో వేచి చూడకుండా తమ ప్రతిభతో సంపాదించుకున్న గౌరవాన్ని గర్వంగా స్వీకరించాలి. తమ హక్కుల కోసం నిరంతరం పోరాడటం కంటే, ఆ హక్కులని  స్వేచ్ఛగా అనుభవించే స్థితికి రావాలి.

మనం ఇతరుల కోసం మన షెడ్యూళ్లని, అభిప్రాయాలని మార్చుకోవడమే కాకుండా, మన లక్ష్యాలను కూడా త్యాగం చేస్తున్నాం. విచారకరమైన విషయం ఏమిటంటే, మనం చేసేది  త్యాగం అని కూడా గుర్తించలేనంతగా అలవాటు పడిపోయాం. పురుషుల కంటే మనమే  పదిరెట్లు ఎక్కువగా క్షమాపణలు చెబుతున్నాం. భవిష్యత్తులో సినిమాలని చూసే ధోరణిలో మార్పు రావాలని సమంత చెప్పుకొచ్చింది.


Also read: Happy raj Movie Review: హ్యాపీ రాజ్ మూవీ రివ్యూ 


ఇక సమంత సినీజర్నీని చూసుకుంటే సొంత సంస్థలోనే 'మా ఇంటి బంగారం' చేస్తుంది. కొత్త షెడ్యూల్ త్వరలోనే స్టార్ కానున్నట్టుగా తెలుస్తుండగా సమంత లీడ్ రోల్. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ కూడా సమంత చేస్తున్నట్టుగా టాక్. ఆ ఇద్దరి పరిచయం కూడా ఫామిలీ మెన్ వెబ్ సిరీస్ లోనే ఏర్పడిన విషయం తెలిసిందే.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.