Home  »  News  »  Valathu Vashathe Kallan: ఓటీటీలోకి దృశ్యం డైరెక్టర్ కొత్త మూవీ.. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి పండగే!

Updated : Mar 27, 2026

మలయాళ ఇండస్ట్రీలో ‘థ్రిల్లర్ సినిమాల కింగ్’గా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్(Jeethu Joseph). ముఖ్యంగా 'దృశ్యం' ఫ్రాంచైజ్ ఆయనకు నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చి పెట్టింది. ఆలాంటి జీతూ జోసెఫ్ నుంచి వచ్చిన మరో ఆసక్తికర క్రైమ్ థ్రిల్లర్ ‘వలతు వశతే కల్లన్’ (Valathu Vashathe Kallan). 

బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ జనవరి 30న థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేస్తోంది. ఈరోజు(మార్చి 27) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మనోరమ మాక్స్, లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

కథ ఏంటంటే..
ఆంటోనీ జేవియర్ (బిజు మీనన్) ఒక అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్. తన వృత్తిలో ఎన్నో అక్రమాలకు పాల్పడుతుంటాడు. మరోవైపు సామ్యూల్ జోసెఫ్ (జోజు జార్జ్) తన కూతురు ఐరీన్‌తో ఎంతో సంతోషంగా గడుపుతుంటాడు. అయితే ఒకరోజు ఐరీన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది, ఆ తర్వాత ఆమె శవమై కనిపిస్తుంది. ఈ కేసు ఆంటోనీ దగ్గరికి వస్తుంది, కానీ అతని ఇన్వెస్టిగేషన్ తీరుపై సామ్యూల్‌కు అనుమానం కలుగుతుంది. తన కూతురి మరణానికి ఆంటోనీకి ఏదో సంబంధం ఉందని భావించిన సామ్యూల్, అతన్ని చిక్కుల్లో పడేయడానికి ఒక పక్కా ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో ఆంటోనీ కొడుకు ఫిలిప్ (కె.ఆర్. గోకుల్) ఈ గొడవలోకి ఎలా వచ్చాడు? ఆంటోనీ తన కొడుకుని ఎలా కాపాడుకున్నాడు? అసలు సామ్యూల్ మరణానికి కారణమేంటి? అనేదే మిగిలిన కథ.

జీతూ జోసెఫ్ మార్క్ సస్పెన్స్
జీతూ జోసెఫ్ అంటేనే స్క్రీన్‌ప్లే మ్యాజిక్. ‘దృశ్యం’ సిరీస్‌తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈ సినిమాలో కూడా ‘పేరెంటింగ్’ అనే పాయింట్‌ను థ్రిల్లర్ ఎలిమెంట్స్‌కు జోడించాడు. దీను థామస్ ఈలన్ అందించిన కథకు జీతూ జోసెఫ్ తనదైన శైలిలో మెరుగులు దిద్దాడు. ఒక తండ్రి తన బిడ్డ కోసం ఎంత దూరం వెళ్తాడు? ఒక తండ్రి తప్పులు తన బిడ్డ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అనే అంశాలను ఇందులో చర్చించారు. ఇక టాలెంటెడ్ యాక్టర్స్ బిజు మీనన్, జోజు జార్జ్ ఎదురు పడే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.

ఈ సినిమాలో లేనా, నిరంజన అనూప్, లియోనా లిషోయ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ‘ఆడుజీవితం’ సినిమాతో మెప్పించిన కె.ఆర్. గోకుల్ ఇందులో పోలీస్ ఆఫీసర్ కొడుకుగా నటించాడు. విష్ణు శ్యామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయింది. 

క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి, ముఖ్యంగా ‘దృశ్యం’ తరహా మైండ్ గేమ్స్ ఆశించే వారికి ఈ వీకెండ్ లో ‘వలతు వశతే కల్లన్’ ఒక మంచి ఛాయిస్.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.