![]() |
![]() |

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు దినేష్ మంగళూరు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దినేష్ వయసు 55 సంవత్సరాలు.
కేజీఎఫ్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దినేష్ మంగళూరు సుపరిచితమే. ఆ సినిమాలో ఆయన ముంబై డాన్ శెట్టి పాత్రలో నటించారు. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. తనదైన నటనతో మెప్పించారు. కిచ్చా, కిరిక్ పార్టీ వంటి చిత్రాలలో కూడా దినేష్ నటించారు.
మొదట కాంతార సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యం పాలైన దినేష్.. బెంగళూరులో చికిత్స పొంది కోలుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇటీవల మళ్ళీ అనారోగ్యానికి గురై.. ఆసుపత్రిలో చేరారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
నటుడిగా మారకముందు కన్నడలో దినేష్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్. ప్రార్థన, తుగ్లక్, బెట్టాడ జీవ, సూర్య కాంతి, రావణతో పాటు ఎన్నో సినిమాలకు వర్క్ చేసి గొప్ప పేరు పొందారు.
దినేష్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి.
![]() |
![]() |