![]() |
![]() |

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'. 'SR కళ్యాణ మండపం' ఫేమ్ శ్రీధర్ గాదె ఈ చిత్రానికి దర్శకుడు. కోడి దివ్య దీప్తి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసింది మూవీ టీమ్.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కిరణ్ పూర్తిస్థాయిలో మాస్ గా నటించిన చిత్రం ఇదే. కిరణ్ గత చిత్రాల మాదిరిగా కామెడీ ఉంటూనే యాక్షన్ కి పెద్ద పీట వేశారు. ట్రైలర్ ని బట్టి చూస్తే ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. మామఅల్లుళ్ళ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా రాజ్ నల్లి, ఎడిటర్ గా ప్రవీణ్ పూడి వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ మధ్య రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించట్లేదు. విభిన్న చిత్రాలకే ఓటు వేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఈ మాస్ ఎంటర్టైనర్ తో కిరణ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |