![]() |
![]() |

'లైగర్' మూవీ ఫ్లాప్ అవ్వడంతో ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో సోషల్ మీడియాకి బ్రేక్ ఇచ్చి, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తానని ఇటీవల చెప్పిన ఛార్మి.. నాలుగు రోజులకే సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. 'రిప్ రూమర్స్' అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'లైగర్'. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్ట్ 25న విడుదలై ఘోర పరాజయం పాలైంది. కాగా పూరి జగన్నాథ్ కి చెందిన పూరి కనెక్ట్స్ లో ఛార్మి భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దీంతో 'లైగర్' విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకున్నప్పటి నుంచి ఛార్మిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 4న "సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను.. బిగ్గర్ గా, బెటర్ గా పూరి కనెక్ట్స్ బౌన్స్ బ్యాక్ అవుతుంది" అంటూ ఆమె ట్వీట్ చేసింది. విచిత్రంగా ఆ ట్వీట్ పైనా ట్రోల్స్ వచ్చాయి.

మరోవైపు పూరి-విజయ్ ల 'జన గణ మన' ఆగిపోయిందని, ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాకి బ్రేక్ అనే మాటని పక్కన పెట్టిన ఛార్మి.. "అన్ని రూమర్లు ఫేక్. ప్రస్తుతం దృష్టంతా పూరి కనెక్ట్స్ అభివృద్ధిపైనే" అంటూ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాకి బ్రేక్ అని చెప్పి నాలుగు రోజులకే వచ్చావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |