![]() |
![]() |

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుస హ్యాట్రిక్ విజయాలతో బాలకృష్ణ మంచి జోరు మీద ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన అప్ కమింగ్ మూవీ మీద సహజంగానే అందరిలో ఆసక్తి నెలకొని ఉంటుంది. ఇక బాలయ్య ఫ్యాన్స్ కి అయితే చెప్పక్కర్లేదు. ప్రతి రోజు మూవీకి సంబంధించిన డీటెయిల్స్ కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
బాలకృష్ణ చెయ్యబోయే నూతన చిత్రం కొన్ని నెలల క్రితం ప్రారంభం అయ్యింది. ఎన్ బి కె 109 గా తెరకెక్కుతు కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకుంది. ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు గతకొంత కాలం నుంచి వస్తున్నాయి. అది అక్షరాలా నిజమే అన్న వాళ్ళు కూడా లేక పోలేదు. కానీ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తప్పుకున్నాడనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ మూవీకి హిట్ డైరెక్టర్ కె ఎస్ రవీంద్రనాధ్(బాబీ ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన గత మూవీ వాల్తేరు వీరయ్య హిట్ అవ్వడంతో బాలయ్య మూవీ పై అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే బాలయ్య లుక్ ఎలా ఉండబోతుందో అనే దాని మీద కూడా అటు ఫ్యాన్స్ లోను ప్రేక్షకులోను క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే తన గత 3 చిత్రాల్లో కూడా బాలయ్య డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో కనపడి ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీలో బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా లాంటి వారు ఇప్పటికే కన్ఫార్మ్ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన భారీ తారాగణం అంతా ఈ చిత్రంలో నటించబోతుంది.
![]() |
![]() |