![]() |
![]() |

ఓటీటీలో ప్రతీవారం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ కాగా మరికొన్ని తెలుగు సినిమాలు కూడా ఉంటున్నాయి.
పలాస, కేరాఫ్ కంచరెపాలెం, బలగం లాంటి చిన్న సినిమాలు కూడా కంటెంట్ తో మంచి సక్సెస్ సాధించాయి. అయితే ' నరకాసుర' అనే సినిమా థియేటర్లలో రిలీజై మిశ్రమ ఫలితాలు పొందింది. ప్రస్తుతం ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా గురించి ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. పలాస హీరో రక్షిత్ అట్లూరి శివ లారీ డ్రైవర్ గా చేశాడు. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా నటించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. చిన్నప్పుడు డైరెక్టర్ తప్పిపోతే హిజ్రాలే అతడిని కుటుంబసభ్యులకి అప్పగించారట. ఆ సంఘటనను స్పూర్తిగా తీసుకున్న డైరెక్టర్ అకోస్టా ఈ సినిమాలో వారికి సంబంధించిన సమస్యను ప్రస్తావించారంట. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో తన చేయి కూడా విరగొట్టుకున్నాడు.
ఈ ప్రమాదం జరిగిన ముప్పై రోజులకి తొరిగి సెట్స్ లోకి వచ్చి మరీ ఆత్మవిశ్వాసంతో సినిమాని పూర్తిచేశారంట. ఆంధ్రప్రదేశ్, తమిళనాటు సరిహద్దులోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో నవంబర్ 3న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమాని మీలో ఎంతమంది చూశారు. చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.
![]() |
![]() |