![]() |
![]() |
.webp)
సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)పుట్టినరోజు..పైగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మంత్రి హోదాలో పవన్ తొలిసారిగా జరుపుకుంటుండంతో రెండు తెలుగురాష్టాల్లోని అభిమానులే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానుల్లో ఈ బర్త్ డే ఒక ప్రత్యేకతని కూడా సంతరించుకుంది.ఇదే రీతిలో పవన్ గురించి నాగబాబు(nagababu)చెప్పిన కొన్ని మాటలు కూడా సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకతని సంతరించుకున్నాయి.
పవన్ బర్త్ డే సందర్భంగా గబ్బర్ సింగ్(gabbar singh)రీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మూవీ స్టార్ట్ అవ్వడం వెనుక జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలని నాగబాబు వెల్లడి చేసాడు. గబ్బర్ సింగ్ ని నా అప్పులు తీర్చడం కోసమే కళ్యాణ్ చేసాడు. బండ్ల గణేష్(bandla ganesh)తో కూడా ఆ విషయం చెప్పాడు. గబ్బర్ సింగ్ తో వాచీ ప్రాఫిట్స్ తో నాగబాబు అన్నయ్య అప్పులు తీర్చేసి మిగతాది నువ్వు తీసుకో నా రెమ్యునరేషన్ సంగతి తర్వాత చూద్దామని చెప్పాడు. గణేష్ కూడా ఒకే అనడంతో గణేష్,నేను కలిసి ముంబై వెళ్లి సల్మాన్ ఖాన్ సోదరుడు అర్ఫాజ్ దగ్గర దబాంగ్ రైట్స్ కొన్నాం. కానీ హరీష్ శంకర్, కళ్యాణ్ అద్భుతమైన ఎపిసోడ్లని పెట్టి హిందీని మించి డెవలప్ చేసారు. ఇక షూటింగ్ కంప్లీట్ అయ్యాక సినిమా బాగా వచ్చిందని అందరకి అర్ధమయ్యింది.

దీంతో కళ్యాణ్ ఎలాంటి స్వార్ధానికి పోకుండా రిలీజ్ కి ముందు గణేష్ ని పిలిచి నీ లాభాలు నువ్వు తీసుకో, నాకు మంచి రెమ్యునరేషన్ ఇస్తే మా అన్నయ్య డబ్బులు నేను చూసుకుంటానని చెప్పాడు. పైగా కళ్యాణ్ ఆర్ధిక పరిస్థితి అంత బాగోకపోయినా కూడా నా బాకీలని తీర్చాడు. అలాగే అన్నయ్య చిరంజీవి కూడా ఆ టైం లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కి సంబంధిన ఇష్యు లో ఉన్నా కూడా నాకు సాయం చేసారు.అందుకే కర్మ చాలా గొప్పది. నన్ను నేను గొప్పగా చెప్పుకోవడానికి ఈ మాట చెప్పడం లేదు. నా అప్పులు పోయి నేను బాగుండాలని కళ్యాణ్ కోరుకున్నాడు.అందుకే గబ్బర్ సింగ్ తో హిట్ ట్రాక్ లోకి వచ్చి నేడు అత్యునత స్థాయికి వచ్చాడు. అలాగే అన్నయ్య చిరంజీవి(chiranjeevi)కూడా సెంట్రల్ మినిస్టర్ అవ్వడం, మళ్ళీ సినిమాల్లోకి రావడం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన మెగా ఫ్యాన్స్ ఐతే చిరు లాంటి అన్నయ్య ని, పవన్ లాంటి తమ్ముడ్ని పొందటం నాగబాబు అదృష్టం అంటు కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |