![]() |
![]() |

"మేం మేం బాగానే ఉంటాం.. మీరు కూడా బాగుండాలి" అంటూ అభిమానం పేరుతో గొడవపడే ఫ్యాన్స్ గురించి హీరోలు చెబుతుంటారు. అయినప్పటికీ కొందరు అభిమానుల తీరులో మార్పు రాదు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానుల మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతోంది. కొందరు అభిమానులైతే.. తామేదో బద్ధ శత్రువులు అన్నట్టుగా దారుణంగా విమర్శలు చేసుకుంటున్నారు. అయితే అలాంటి అభిమానులకు ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టాడు అల్లు అర్జున్. (Pawan Kalyan Birthday)

నేడు(సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ బన్నీ ట్వీట్ చేశాడు. పవర్ స్టార్ & డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఈ ఒక్క ట్వీట్ తో ఇరు హీరోల అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. "ఎంత కాదనుకున్నా ఇద్దరు బంధువులు, వారిద్దరూ ఎప్పుడు బాగానే ఉంటారు.. మనం కూడా అలాగే ఉండాలి" అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ట్వీట్ తోనైనా అభిమానులు విమర్శలను పూర్తిగా పక్కన పెట్టేస్తారేమో చూడాలి.
![]() |
![]() |