![]() |
![]() |

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram). డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా ఆగస్టు 29న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి పరవాలేదు అనే టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.5.88 కోట్ల షేర్ రాబట్టిన సరిపోదా శనివారం.. రెండు రోజు రూ.3.04 కోట్ల షేర్, మూడో రోజు రూ.4.68 కోట్ల షేర్ తో సత్తా చాటింది. మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.13.60 కోట్ల షేర్ రాబట్టింది.
తెలుగు స్టేట్స్ లో ఏరియాల వారీగా చూస్తే ఇప్పటిదాకా నైజాంలో రూ.6.74 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.1.83 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.5.03 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.3.55 కోట్లు, ఓవర్సీస్ రూ.7.55 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో రూ.24.70 కోట్ల షేర్ రాబట్టింది 'సరిపోదా శనివారం'.
రూ.41 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. వరల్డ్ వైడ్ గా మొదటిరోజు రూ.11.38 కోట్ల షేర్, రెండో రోజు రూ.5.34 కోట్ల షేర్, మూడో రోజు రూ.7.98 కోట్ల షేర్ తో.. మూడు రోజుల్లో 60 శాతం రికవర్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా దాదాపు రూ.17 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
నాలుగో రోజు ఆదివారం కావడంతో మరో 7-8 కోట్ల షేర్ రాబట్టే అవకాశముంది. అంటే మొదటి వీకెండ్ లోనే ఈ చిత్రం రూ.30 కోట్లకు పైగా షేర్ రాబట్టనుంది. తెలుగు రాష్ట్రాలలో వర్షాల ప్రభావం లేకపోయినట్లయితే వసూళ్లు ఇంకా మెరుగ్గా ఉండేవని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
![]() |
![]() |