![]() |
![]() |

జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇండియన్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ డ్యాన్స్ లకు జపాన్ లో ఎందరో అభిమానులు ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' రాకముందే 'బాద్‍షా' టైంలోనే తారక్ కి అక్కడ ఫ్యాన్స్ ఉండేవారు. ఇక ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ పొందిన ఎన్టీఆర్.. జపాన్ మార్కెట్ పై మరింత ఫోకస్ పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'దేవర'ను జపాన్ లో రిలీజ్ చేస్తున్నాడు. (Jr NTR)
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, గతేడాది సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టింది. దేవర మూవీ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మంచి వసూళ్లు రాబట్టి, ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టి.. ఎన్టీఆర్ స్టార్డంను మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో విడుదలకు సిద్ధమవుతోంది. (Devara Japan)
దేవర సినిమా జపాన్ లో మార్చి 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేశాడు ఎన్టీఆర్. తాజాగా జపాన్ మీడియాకి ఆన్ లైన్ ద్వారా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అలాగే మార్చి 22న స్వయంగా జపాన్ వెళ్ళి, దేవర ప్రమోషన్స్ లో పాల్గొననున్నాడు.
దేవరలో ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేశాడు. యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లు అదరగొట్టాడు. ఎన్టీఆర్ యాక్షన్ కి, డ్యాన్స్ లకి జపాన్ ఆడియన్స్ ఎట్రాక్ట్ అయితే.. దేవర అక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశముంది. మరి దేవరతో ఎన్టీఆర్.. జపాన్ లో ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
![]() |
![]() |