![]() |
![]() |

ఎన్టీఆర్(Ntr),హృతిక్ రోషన్(Hrithik Roshan)ల అప్ కమింగ్ మూవీ 'వార్ 2 '(War 2)కి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా కూడా వార్ 2 క్రేజ్ ని సంపాదించుకుంది. తెలుగులో అతి త్వరలోనే భారీఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా, తాజాగా ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ కలిగిన 'ఎస్కైర్'(Esquire)మ్యాగజైన్ ఎన్టీఆర్ ని తమ ముఖచిత్రంగా ప్రచురించింది. అందులో భాగంగా సదరు 'ఎస్కైర్ మ్యాగజైన్' కి ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతు వార్ కోసం లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమల వారు పని చేసారు. ఇకపై టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అనేది లేదు. మనమంతా భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన వాళ్ళం. ఆ దిశగానే సినిమాలు తెరకెక్కాలి. సినిమా హిట్ అవ్వడానికి ప్రత్యేక ఫార్ములా అంటూ ఉండదు.నేను వార్ 2 చెయ్యడానికి ప్రధాన కారణం స్క్రిప్ట్. చాలా బలమైన కథ,కథనంతో రూపొందింది. నా పర్సనల్ విషయాలకి వస్తే నా భార్య ప్రణతి, స్నేహితుల కోసం వంట చెయ్యడం చాలా ఇష్టం. ఈ విషయంలో నేను గొప్ప చెఫ్ ని. పునుగులు బాగా వేస్తాను. బిర్యానీ కూడా బాగా వండుతాను. జీవితంలో ఏది ప్లాన్ చేసుకునే అలవాటు లేదు. వచ్చిన అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకుంటానని తెలిపాడు.
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'వార్ 2 'ని అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్(Yash Raj Films)నిర్మించగా హిట్ చిత్రాల దర్శకుడు 'అయాన్ ముఖర్జీ'(Ayan Mukerji)తెరకెక్కించాడు. కియారా అద్వానీ హీరోయిన్ కాగా అనిల్ కపూర్, అశుతోష్ రానా, దిషిత సెహగల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. టాప్ హీరోయిన్ అలియాభట్(Alia Bhatt) క్యామియో అప్పీరియన్స్ ఇవ్వనుంది. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తుంది.

![]() |
![]() |