Home  »  News  »  ఇండియన్ సినీ హిస్టరీని షేక్ చేసిన అత్యంత ఖరీదైన సినిమాలు ఇవే 

Updated : Aug 1, 2026

 

సినిమాని అల్లాటప్పగా తీసుకోవడానికి వీలు లేదు దేశాన్ని ఏలతారని పోతులూరి వీర బ్రహ్మం గారు చెప్పిట్టుగానే జరుగుతుంది. అందుకు తగ్గట్టే మేకర్స్ కూడా సినిమాని తమ చంటి బిడ్డలా భావించి అత్యంత భారీ వ్యయంతో, ఎన్నో హంగులని సమకూర్చి నిర్మిస్తున్నారు. దీంతో సినిమా ఖరీదైన సినీ దినుసులతో ముస్తాబవుతు అభిమానులు, మూవీ లవర్స్ కి ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది.  

భారతీయ చలనచిత్ర పరిశ్రమ గత కొన్నేళ్లుగా ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలను అందుకోవడమే కాకుండా, బడ్జెట్ విషయంలోనూ హాలీవుడ్‌కి సవాల్ విసురుతోంది. ఒకప్పుడు పది, ఇరవై కోట్లతో ముగిసే సినిమా నిర్మాణాలు, నేడు వందల నుంచి వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతూ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా మన నిర్మాతలు, దర్శకులు ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ విపణిలో సగర్వంగా చాటుతున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్లోబల్ ప్రొడక్షన్ వాల్యూస్, మరియు టాప్ స్టార్‌కాస్ట్‌తో రూపొందుతున్న అత్యంత ఖరీదైన చిత్రాల జాబితా ఇప్పుడు సినీ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అసాధారణ బడ్జెట్ చిత్రాల జాబితాలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ మొదటి స్థానంలో నిలిచింది 'రామాయణ' ప్రాజెక్ట్. ప్రసిద్ధ నిర్మాత నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు భాగాల అంచనా బడ్జెట్ ఏకంగా  4,000 కోట్లు  భారతీయ సినిమా చరిత్రలోనే కాకుండా, ఆసియా ఖండంలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా ఇది సరికొత్త రికార్డులని నెలకొల్పబోతోంది.

ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో నిలుస్తోంది దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా 'వారణాసి'. ఈ సినిమా కోసం మేకర్స్ సుమారు 1,200 కోట్ల నుంచి 1,400 కోట్ల బడ్జెట్‌ని కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. వీటి తర్వాతి స్థానంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' స్థానం దక్కించుకుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ వండర్ బడ్జెట్ సుమారు రూ. 600 కోట్లు. అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌ను కళ్లముందు ఉంచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఆస్కార్ సాధించిన  'ఆర్ఆర్ఆర్' కూడా అత్యంత ఖరీదైన సినిమాల జాబితాలో ప్రముఖంగా నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ విజువల్ వండర్ కోసం నిర్మాతలు సుమారు  550 కోట్లు వెచ్చించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సాధించిన ఘనవిజయం, అందుకున్న ఆస్కార్ అవార్డు ఇండియన్ సినిమా ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పాయి.

ఈ విజువల్ స్పెక్టాకిల్స్ సరసన ప్రభాస్ నటించిన మరో భారీ పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్' నిలిచింది. రామాయణ కథాంశంతో రూపుదిద్దుకోగా సుమారు 700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అదేవిధంగా ఇండియన్ రజనీకాంత్, శంకర్ ల  సంచలనాత్మక కాంబినేషన్‌లో వచ్చిన గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ రోబో '2.0' సినిమా నిర్మాణం కోసం 500 కోట్ల వరకు వ్యయం అయింది. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లు సృష్టించిన  'పుష్ప 2: ది రూల్',బాలీవుడ్ మూవీ 'కింగ్' చిత్రాల బడ్జెట్ సుమారు 400 కోట్ల నుంచి 450  కోట్ల వరకు ఉండగా, విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమా 380 కోట్ల నుంచి  400 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకుంది.

Also read: ఆ విషయంపై నాది ఓపెన్ మైండ్.. ఫ్యాన్స్ ఎలా అయినా తీసుకోవచ్చు


వీటితో పాటు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా వచ్చిన బాలీవుడ్ ఫాంటసీ అడ్వెంచర్ 'బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ'  375 కోట్ల నుంచి  410 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైంది.  రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'గేమ్ చేంజర్' సుమారు  350 కోట్ల నుంచి 425 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఇలా వేల, వందల కోట్ల భారీ పెట్టుబడులతో అద్భుతమైన విజువల్ వండర్స్‌ని అందిస్తూ, భారతీయ చిత్రసీమ అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తు ఇక్కడ ఉంది సినిమా అని సగర్వంగా చాటి చెప్తూ ఉంది.

Cinema, Varanasi, Ramayana






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.