![]() |
![]() |

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేష్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న 'క్రేజీ కళ్యాణం' మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. భద్రప్ప గాజుల దర్శకత్వంలో యారో సినిమాస్ నిర్మించిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది.
టీజర్ తండ్రి కూతుళ్ల మధ్య జరిగే సంభాషణతో స్టార్ట్ అవుతుంది. "నా చిన్న బిడ్డ ఇంగ్లీష్ లో కూడా బాగా మాట్లాడుతాది.. ఇంగ్లీష్ లో మాట్లాడు బిడ్డ" అని నరేష్ అనగానే.. అనుపమ అమాయకంగా చెప్పే "ఓ మై గాడ్" డైలాగ్ తోనే నవ్వులు మొదలవుతాయి. అక్కడి నుంచి అసలు కథ మలుపు తిరుగుతుంది. పెళ్లి సంబంధాల గోల, అక్కా చెల్లెళ్ల మధ్య పోటీ, కుటుంబాల మధ్య చిచ్చు... ఇలా ప్రతీ సీన్ నవ్వు పూయించేలా డిజైన్ చేశారు. "నీ కొడుకే మొండోడు అనుకుంటున్నాడేమో.. నాలో కూడా ఆయన రక్తమే ప్రవహిస్తుంది" అంటూ అనుపమ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ అండ్ ఫ్రెష్‌గా కనిపిస్తోంది. ఇప్పటి వరకు గ్లామరస్, ఎమోషనల్ రోల్స్ లో చూసిన అనుపమను, ఇందులో పక్కా పల్లెటూరి చలాకీ అమ్మాయిగా, అంతే మొండి పట్టుదల ఉన్న క్యారెక్టర్లో ప్రెజెంట్ చేశారు.
ఇక తరుణ్ భాస్కర్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దర్శకుడిగా ప్రతిభ చూపించిన తరుణ్.. నటుడిగా కూడా తనదైన టైమింగ్, ఈజ్ తో నవ్విస్తున్నారు. ఇందులో తగిన మత్తులో ఉంటూ కొత్తగా కనిపించారు. ముఖ్యంగా "బతుకనివ్వరు.. చావనివ్వరు", "దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ వాడు చచ్చినట్టే!" అంటూ తరుణ్ చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.
"దేవుడా.. మా పెద్దల్లుడి కంటే ఇంకా దరిద్రపోడు మా అన్నకు అల్లుడుగా రావాలి" అని నరేష్ అనుకునే సన్నివేశాలు పల్లెటూరి మధ్య తరగతి ఇంట్లో జరిగే అల్లరిని, మనస్పర్థలను చాలా హ్యూమరస్‌గా ప్రతిబింబిస్తున్నాయి.
మొత్తానికి 'క్రేజీ కళ్యాణం' టీజర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వుల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది. ఫ్యామిలీ డ్రామా, పెళ్లి సందడి, కన్ఫ్యూజన్ కామెడీ ఇష్టపడే ప్రేక్షకులకు ఇది పక్కా విందు కానుంది.
Crazy Kalyanam Teaser, Anupama Parameswaran, Tharun Bhascker, Naresh
![]() |
![]() |