![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో వస్తున్న హారర్ కామెడీ ఫిల్మ్ 'కొరియన్ కనకరాజు'. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 7న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.
అనంతపురం జిల్లా పెనుకొండ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ కథలో వరుణ్ తేజ్ ‘కనకరాజు’ అనే లోకల్ కుర్రాడిగా పూర్తి స్థాయి మాస్ పాత్రలో కనిపిస్తున్నారు. అలాంటి రూరల్ మాస్ పాత్రలోకి కొరియన్ దెయ్యం ఆత్మ ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తికర పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ ట్రైలర్ ఆరంభంలోనే సత్య, రితిక నాయక్ కలిసి కొరియన్ దెయ్యం ఆవాహన పూజ చేసే సన్నివేశం నవ్వులు పూయించింది. ఆద్యంతం ట్రైలర్ లో ఫన్ కనిపించింది. ముఖ్యంగా సత్య పాత్ర థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. హారర్, కామెడీ ఎలిమెంట్స్ తో మాస్ ఆడియన్స్ మెచ్చేలా ఈ సినిమాను మలిచినట్లుగా ట్రైలర్ తో అర్థమవుతోంది.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్, మేకోవర్, మాస్ డైలాగ్ డెలివరీ మునుపెన్నడూ చూడని రీతిలో ఉన్నాయి. ఒకవైపు పెనుకొండ వాసిగా పక్కా మాస్ లుక్ లో, మరోవైపు కొరియన్ డాన్ గా స్టైలిష్ లుక్ కనిపిస్తున్నాడు.
కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్.. ఈ 'కొరియన్ కనకరాజు' సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు.
Korean Kanakaraju Trailer, Varun Tej, Ritika Nayak, satya comedy, Merlapaka Gandhi
![]() |
![]() |