![]() |
![]() |
.webp)
కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు(mohan babu)కుటుంబంలో జరిగిన గొడవలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.మోహన్ బాబు ఆయన పెద్ద కొడుకు విష్ణు(vishnu) ఒక వైపు,రెండో కొడుకు మనోజ్(manoj)మరో వైపుగా జరుగుతున్న ఆ గొడవలని కవర్ చెయ్యడానికి మీడియా వాళ్ళు వెళ్లగా మోహన్ బాబు ఆవేశంతో ఒక విలేకరి మీద దాడి చెయ్యడం జరిగింది.ఈ విషయంలో మోహన్ బాబు పై కేసు కూడా నమోదయ్యింది.
ఇక మోహన్‌బాబు ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో అప్లై చెయ్యడం జరిగింది.కానీ రీసెంట్ గా కోర్టు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది.దీంతో మోహన్ బాబు ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.కాగా మోహన్ బాబు గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తున్ననేపథ్యంలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.ఇక మోహన్ బాబు సదరు జర్నలిస్ట్ కి సారీ చెప్పడం కూడా జరిగింది.
![]() |
![]() |