![]() |
![]() |
.webp)
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(jani master)కొన్నిరోజుల క్రితం లైంగిక వేధింపుల కేసులో జైలు జీవితం గడిపి ఆ తర్వాత బెయిల్ పై బయటకి వచ్చిన విషయం తెలిసిందే.ఇటీవలే ఒక సినిమా ఫంక్షన్ కి కూడా హాజరయ్యిన జానీ మాస్టర్ జరిగిన విషయంలో తనని నమ్మి వెనకాల నిలబడిన వారందరకీ దన్యవాదాలు కూడా తెలిపాడు.అదే టైంలో జానీ మాస్టర్ సినీ కెరీర్ ఏ విధంగా ఉంటుందనే ఆసక్తి అయన అభిమానుల్లో ఉంది.
ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)నటించిన గేమ్ చేంజర్(game changer)మూవీ నుంచి జానీ మాస్టర్ కంపోజ్ చేసిన 'ధూప్' అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ప్రోమో తో రిలీజ్ అయిన ఈ సాంగ్ లోని చరణ్ వేసిన స్టెప్ లకి ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ కూడా ఫుల్ ఫిదా అయిపోతున్నారు.రేపు థియేటర్ లో ఫుల్ సాంగ్ కి ఫ్యాన్స్ లో పూనకాలు రావడం ఖాయమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. జానీ మాస్టర్ కూడా మరిన్ని అవకాశాలు పొందాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.

![]() |
![]() |