![]() |
![]() |
.webp)
తిరుపతి కి చెందిన కౌశిక్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)అంటే తనకి చాలా ఇష్టం.ఎన్టీఆర్ సినిమాలన్నీ క్రమం తప్పకుండా చూస్తుంటాడు.దేవర(devara)రిలీజ్ టైంలో క్యాన్సర్ బారిన పడి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.తన చివరి కోరిక దేవర సినిమా చూసి చనిపోవడం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా చేసాడు.దీంతో విషయం ఎన్టీఆర్ కి తెలియడంతో కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడాడు. ఆ సమయంలో తన వైద్యానికి అయ్యే ఖర్చులని చూసుకుంటానని ఎన్టీఆర్ హామీ ఇవ్వడం జరిగింది.
ఈ విషయంపై రీసెంట్ గా కౌశిక్ తల్లి మాట్లాడుతు ఎన్టీఆర్ నుంచి ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదు, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండున్నర లక్షలు.సిఎమ్ సహాయనిధి నుంచి 11 లక్షలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు 40 లక్షలు ఇవ్వడం జరిగింది.ఇప్పుడు కౌశిక్ కండిషన్ హై నుంచి లో అయ్యింది.ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగుంది.హార్ట్,లంగ్స్ ఇన్ఫెక్షన్ సోకడంతో కీమో చెయ్యడం వలన బాబు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు.కాకపోతే మరో 20 లక్షలు చెల్లిస్తే గాని డిచ్ఛార్జ్ చేయమని హాస్పిటల్ వాళ్ళు అంటున్నారని కౌశిక్ తల్లి చెప్పుకొచ్చింది. చెన్నైలోని అపోలోలో కౌశిక్ ఉన్నాడు.
.webp)
![]() |
![]() |