![]() |
![]() |
.jpg)
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే తమిళ నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. కేవలం కథానాయకుడిగానే కాదు ప్రతినాయకుడి పాత్రల్లోనూ దర్శనమిస్తూ మెప్పిస్తున్నారీ మక్కల్ సెల్వన్.
కాగా, తెలుగునాట సైరా నరసింహారెడ్డి, ఉప్పెన వంటి స్ట్రయిట్ పిక్చర్స్ తో ఆకట్టుకున్న విజయ్.. త్వరలో మరో టాలీవుడ్ మూవీలో సందడి చేయనున్నారట. అది కూడా.. మెగాకాంపౌండ్ మూవీనే కావడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని లాక్ చేశారని టాక్. కథ, పాత్ర నచ్చడంతో మక్కల్ సెల్వన్ కూడా వెంటనే ఓకే చెప్పారని అంటున్నారు. త్వరలోనే చిరు - బాబీ కాంబినేషన్ మూవీలో విజయ్ సేతుపతి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మరి.. సైరాలో చిరు పక్కన పాజిటివ్ రోల్ లో మెప్పించిన విజయ్ సేతుపతి.. ఈ సారికి చిరుకి విలన్ గా ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తారో చూడాలి.
![]() |
![]() |