![]() |
![]() |
.webp)
కొద్దిరోజులుగా మంచు కుటుంబంలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒక వైపు.. మంచు మనోజ్ మరోవైపు అన్నట్టుగా వివాదం నడుస్తోంది. మొదట హైదరాబాద్ లో మోహన్ బాబు నివాసం దగ్గర, ఆ తర్వాత తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ సాక్షిగా ఈ గొడవలు జరిగాయి. అయితే ఈ వివాదానికి కారణం ఆస్తి తగాదాలే అని తెలుస్తోంది.
ఇదే విషయమై తాజాగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మోహన్ బాబు, మంచు మనోజ్ వెళ్లారు. తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడని, ఆస్తులు కావాలని డిమాండ్ చేస్తున్నాడని మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో ఇప్పటికే మనోజ్ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా రంగారెడ్డి జిల్లా మేజిస్ట్రేట్ ముందు మోహన్ బాబు, మనోజ్ హాజరయ్యారు. ఇద్దరు పలు డాకుమెంట్స్ తీసుకొని వచ్చినట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.
![]() |
![]() |