![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)2013 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే.'గౌరవం' అనే సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో శ్రీరస్తు,శుభమస్తు,కొత్త జంట,ఏబిసిడి,ఒక్క క్షణం, ఉర్వశివో రాక్షసీవో, బడ్డీ వంటి పలు విభిన్న చిత్రాలు ఉన్నాయి. 'బడ్డీ' గత సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకాదరణని పొందింది.
రీసెంట్ గా అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా పుష్ప 2(Pushpa 2)క్లైమాక్స్ సీన్ లో పుష్ప రాజ్ ని తన సోదరులు ఆలింగనం చేసుకున్న ఫోటో షేర్ చేసి 'పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్ కి జత చేసిన మరో నాలుగు నిమిషాల తర్వాత పుష్ప 2 మూవీని చూసాను.మూవీ చూస్తుంటే హై ఫీల్ వస్తుంది,సినిమా పూర్తయ్యేసరికి కన్నీళ్లు కూడా వచ్చేసాయి.థియేటర్ వర్షన్ లో మిస్ అయిన లింక్స్ అన్ని రీ లోడెడ్ వర్షన్ లో కవర్ చేసారు.నాకు ఎంతగానో నచ్చిందని తెలిపాడు.
.webp)
![]() |
![]() |