![]() |
![]() |

వెండితెరపై శ్రీలక్ష్మి చేయని కామెడీ లేదు, నవ్వించని సినిమా లేదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆమె వెండితెరపై తనదైన హాస్యంతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. ఆమె నవ్వు వెనకా ఓ విషాదం దాగి వుందట. ఈ విషయాన్ని 'ఆలీతో సరదాగా' షోలో బయటపెట్టి షాకిచ్చారు. ఈటీవీలో నటుడు అలీ వ్యాఖ్యాతగా ప్రసారం ఈ కార్యక్రమంలో నటి హేమతో కలిసి శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. "ఆ రోజుల్లో మనకు కష్టం వస్తే తీర్చే వాళ్లుండేవారు కానీ ఈ రోజుల్లో అలా లేదనిపిస్తోంది. నమ్ముతారో నమ్మరో.. నా బాధను గోడలతో పంచుకుంటున్నా. ఒకానొక సమయంలో మా సోదరుడు ప్రాణాపాయ స్థితిలో వున్నారని చెప్పినా ఈ ఒక్క షాట్ చేసి వెళ్లమన్నారు. ఆఖరికి నేను వెళ్లేలోపే ఆయన చనిపోయారు. అప్పుడు ఛీ.. ఈ బతుకు అవసరమా అనిపించింది." అని తన మనసులోని ఆవేదనని బయటపెట్టారు శ్రీలక్ష్మి.
ఇదే సందర్భంగా నటి హేమ కూడా భావోద్వేగానికి గురయ్యారు. "కెమెరా ముందు హాయిగా నవ్వుతూ నటిస్తాం." అంటూ హేమ తెర వెనుక కష్టాలని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. పూర్తి కార్యక్రమం ఈ నెల 15న ఈటీలో ప్రసారం కానుంది.
![]() |
![]() |