Home  »  News  »  'ఫౌజీ'లో బిగ్ సర్‌ప్రైజ్.. ప్రభాస్ తల్లిగా అలనాటి అందాల తార.!

Updated : Aug 1, 2026

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో రాబోతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' గురించి అదిరిపోయే అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ జయప్రద.. ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 

1940ల నేపధ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పిరియాడిక్ కథలో ఎమోషన్స్ చాలా కీలకం. హను రాఘవపూడి మార్క్ ఎమోషన్స్ ఉంటాయట. 'సీతారామం' సినిమాలో ఎమోషన్ ఎంతలా వర్కవుట్ అయిందో చూశాం. ఇప్పుడు ఫౌజీలో కూడా ప్రభాస్ - జయప్రద మధ్య వచ్చే మదర్-సన్ సెంటిమెంట్ సీన్లు సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని చెప్తున్నారు. 

ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి కూడా ఒక పవర్ ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. 1940 పీరియడ్ లొకేషన్లు, ఆ కాలం నాటి ఆర్మీ వాతావరణం, గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాయి.

ప్రభాస్ అభిమానులకు మరో మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ వెయిట్ చేస్తోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఆగస్టు 14న 'ఫౌజీ' చిత్రం నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ భారీ మూవీ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

 

Fauzi Movie, Prabhas, Jaya Prada, Hanu Raghavapudi, Imanvi

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.