Home  »  News  »  అగస్ట్ లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సందడి.. మనల్ని ఎవడ్రా ఆపేది

Updated : Aug 1, 2026

 

అగస్ట్ నెల వచ్చేసింది. ఈ నెల ఎవరికీ ఎలా ఉంటుందో తెలియదు గాని సినీ ప్రియుల రాశి ఫలం మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండనుందని చెప్పవచ్చు.ఎందుకంటే   ఒకటి కాదు రెండు కాదు పలు క్రేజీ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటిగా సెల్యులాయిడ్ పై సందడి చేయడానికి ముస్తాబవుతున్నాయి. మరి ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.
 


 మొదటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'కొరియన్ కనకరాజు'. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' ఆగస్టు 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి విడుదలైన పోస్టర్ల వరకు ప్రతి ఒక్కటి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని మరియు భారీ అంచనాలను పెంచేశాయి. ఇందులో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, గ్లామరస్ బ్యూటీ దక్ష నగార్కర్ ఒక ప్రత్యేక గీతంలో అలరించబోతోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ బాక్సాఫీస్ హంగామాలో తదుపరి భారీ ఆకర్షణగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' నిలవనుంది. ఇటీవల 'కరుప్పు' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న సూర్య, ఈసారి తెలుగు మరియు తమిళ ద్విభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్రంలో లేటెస్ట్ క్రేజీ బ్యూటీ మమతా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ వీకెండ్ కానుకగా ఆగస్టు 14వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.


Also read: ప్రభుదేవా చేసేది డాన్స్ కాదు, ఆ సీక్రెట్ ఏంటంటే.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ 

అంతేకాకుండా, మాస్ మహారాజా రవితేజ మరియు క్లాసిక్ ఎమోషనల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఇరుముడి'. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మాస్ సాంగ్స్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొంది ట్రెండింగ్‌లో నిలిచాయి. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితంపై అభిమానుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ సిద్ధమయ్యారు. 'కేజీఎఫ్' సిరీస్‌తో పాన్-ఇండియా స్థాయిలో తిరుగులేని ఇమేజ్ సాధించిన యష్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ విజువల్ స్పెక్టాకిల్ 'టాక్సిక్'. ప్రతిభావంతమైన దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నుంచి వెలువడిన ప్రతి అప్‌డేట్ అంచనాలని రెట్టింపు చేసింది. ఈ విధంగా ఆగస్టు నెల సినీ ప్రియులకి అన్ని బాధలు మర్చిపోయి నూతనోత్సాహాన్ని ఇవ్వడానికి ముస్తాబు అవుతుంది.
korean kanakaraju, viswanath and sons, Toxic, irumudi






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.