![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'సలార్' బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా.. మొదటి వారం పూర్తయ్యే సరికి 75 శాతానికి పైగా రికవర్ సాధించి, హిట్ దిశగా దూసుకుపోతోంది.
ఏడు రోజుల్లో నైజాంలో రూ.62.71 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.17.41 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.48.42 కోట్ల షేర్ రాబట్టిన సలార్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.128.54 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక రూ.19.35కోట్ల షేర్, తమిళనాడు రూ.9.65 కోట్ల షేర్, కేరళ రూ.5.80 కోట్ల షేర్, హిందీ+రెస్టాఫ్ ఇండియా రూ.51.10 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.52.80 కోట్ల షేర్ కలిపి.. వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.267.24 కోట్ల షేర్ రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన సలార్.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.78 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం థియేటర్లలో ఇతర సినిమాల నుంచి పోటీ లేకపోవడం, సెకండ్ వీకెండ్ కి న్యూ ఇయర్ హాలిడే కలిసి రావడంతో.. మరో ఐదు రోజుల్లో సలార్ మూవీ బ్రేక్ ఈవెన్ కి చేరువయ్యే అవకాశముంది.
సలార్ మొదటి వారం వసూళ్లు:
నైజాం: రూ.62.71 కోట్ల షేర్
సీడెడ్: రూ.17.41 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.48.42 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల వసూళ్లు: రూ.128.54 కోట్ల షేర్
కర్ణాటక: రూ.19.35కోట్ల షేర్
తమిళనాడు: రూ.9.65 కోట్ల షేర్
కేరళ: రూ.5.80 కోట్ల షేర్
హిందీ+రెస్టాఫ్ ఇండియా: రూ.51.10 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.52.80 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం వసూళ్లు: రూ.267.24 కోట్ల షేర్
![]() |
![]() |