![]() |
![]() |
.jpg)
మహమ్మారి సెకండ్ వేవ్ క్రమేణా తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి షూటింగ్‌లను కొనసాగించడానికి దేశంలోని అన్ని భాషా చిత్రసీమలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్‌లు కొనసాగుతున్నాయి. యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న మాగ్నమ్ ఓపస్ 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చిత్రం షూటింగ్‌ను కూడా కొనసాగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బాలీవుడ్ తార అలియా భట్ రెండు భారీ సినిమాల షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతోంది. ముందుగా ఆమె సంజయ్ లీలా భన్సాలీ మూవీ 'గంగుబాయ్ కథియవాడి' షూటింగ్‌లో జూన్ 20 నుంచి పాల్గొనబోతోంది. ఆ సినిమాకు సంబంధించి ఆమె వర్క్ కేవలం రెండు రోజులే మిగిలుంది. అంటే 'గంగుబాయ్' షూటింగ్‌ను ఆమె ఫినిష్ చేయనున్నదన్న మాట.
ఆ తర్వాత ఆమె 'ఆర్ఆర్ఆర్' మూవీ షూటింగ్ కోసం ముంబై నుంచి హైదరాబాద్ రానున్నది. హైదరాబాద్‌లో జూలై 1 నుంచి ఆమె షూటింగ్ మొదలవుతుంది. రెండు వారాల పాటు ఆమె ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుందని సమాచారం. ఆమె కాంబినేషన్ సీన్స్ ఎక్కువగా రామ్‌చరణ్‌తోటే కాబట్టి, ఆయన కూడా షూటింగ్‌కు రెడీ అవుతున్నట్లే.
అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకు నిర్మాతలు ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, ఆ తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్ పనులు జరపాల్సి ఉన్నందున 2022లో ఈ సినిమా ప్రేక్షకుల మధ్యకు రావచ్చని అంచనా వేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో 'ఆర్ఆర్ఆర్' విడుదలనున్నది.
![]() |
![]() |