![]() |
![]() |
.webp)
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమాలు వంద కోట్ల బిజినెస్ చేస్తుంటాయి. అలాంటిది ఓ డబ్బింగ్ మూవీ ఏకంగా రూ.90 కోట్ల బిజినెస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలవుతున్న కన్నడ చిత్రం 'కాంతార చాప్టర్ 1' తెలుగునాట 90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. (Kantara Chapter 1)
రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన 'కాంతార' మూవీ 2022లో విడుదలై పాన్ ఇండియా సక్సెస్ అందుకుంది. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం సాధించింది. 'కాంతార'కి ప్రీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో 'కాంతార చాప్టర్ 1'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే భారీ బిజినెస్ జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బిజినెస్ సంచలనంగా మారింది.
నైజాంలో రూ.40 కోట్లు, ఆంధ్రాలో రూ.40 కోట్లు, సీడెడ్ లో రూ.10 కోట్లతో.. తెలుగు రాష్ట్రాల్లో 'కాంతార చాప్టర్ 1' రూ.90 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే ఈ మూవీ తెలుగునాట బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. రూ.90 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది.
తెలుగులో రూ.2 కోట్ల బిజినెస్ చేసిన 'కాంతార' దాదాపు రూ.30 కోట్ల షేర్ రాబట్టి సర్ ప్రైజ్ చేసింది. అయితే ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' తెలుగులో హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. దానికి మూడు రెట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. మరి 'కాంతార చాప్టర్ 1' ఆ ఫీట్ సాధిస్తుందో లేదో చూడాలి.
![]() |
![]() |