![]() |
![]() |

ప్రముఖ అగ్రహీరో 'విజయ్'(Vijay)తన పొలిటికల్ పార్టీ 'తమిళగ వెట్రి కజగం'(TVK)కి సంబంధించిన సభని,ఇటీవల 'కరూర్'(karur)జిల్లా కేంద్రంలో నిర్వహించగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అత్యంత పాశవికమైన ఈ సంఘటనలో ఇప్పటి వరకు నలభై ఒక్క మంది చనిపోగా, సుమారు ఎనభై మంది వరకు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది పిన్న వయస్కులు ఉండటం అత్యంత బాధాకరమైన విషయం. ఈ ఘోర ప్రమాదానికి విజయ్ కారణమనే విమర్శలు,ప్రత్యర్థి వర్గంతో పాటు పలువురు నుంచి వస్తున్నాయి.
రీసెంట్ గా ఈ మొత్తం విషయంపై ప్రముఖ విలక్షణ నటుడు 'మన్సూర్ అలీ ఖాన్'(Mansoor Ali Khan)మాట్లాడుతు కరూర్ ఘటన వెనుక ప్రణాళిక బద్దమైన కుట్ర కోణం ఉంది. విజయ్ ని రాజకీయంగా సమాధి చెయ్యాలని కొంత మంది చూస్తున్నారు. కరూర్ నా సొంత ఊరు. సంఘటన జరిగిన దగ్గరనుంచి నాకు నిద్ర పట్టడం లేదు. తొక్కిసలాటలో మరణించిన వారందరు ఎలాంటి బాధని అనుభవిస్తూ చనిపోయారో తలుచుకుంటుంటే,నిద్ర ఎలా పడుతుంది. మన దేశంలో ఇలా జరగడం సిగ్గు చేటు. కరూర్ ఘటన ని తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆయుధంగా ఉపయోగించుకోనున్నారు. విజయ్ ని రాజకీయంగా ఎదుర్కోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటారా? ఇదొక నీతి లేని చర్య. 41 మంది మరణానికి విజయ్ సమాధానం చెప్పాలని అంటున్నారు. కానీ విజయ్ ని ఒక కుట్ర ప్రకారమే ఘటనాస్థలి నుంచి పంపించేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థతో ఒరిగేది ఏమి లేదు.
నా తమ్ముడు విజయ్ ని నేనే పెంచాను. చాలా గొప్ప వ్యక్తి. ఇలాంటి వాటికి బెదిరిపోడు. విజయ్ ని ఇబ్బంది పెట్టే వారికి ఆరునెలల్లో జైలు శిక్ష పడుతుందని మన్సూర్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు తమిళనాడు స్టేట్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 1991 వ సంవత్సరంలో విజయ్ కాంత్ హీరోగా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ తో 'మన్సూర్ అలీఖాన్' తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయ్యాడు. ఇప్పటి వరకు తన ఎంటైర్ కెరీర్ లో తమిళ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో కలుపుకొని సుమారు 250 చిత్రాల వరకు చెయ్యగా, విజయ్ తోను పలు చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలు పోషించాడు. చివరిగా ఇద్దరు 'లియో'లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మే లేదా జూన్ లో జరగబోతున్నాయనే విషయం తెలిసిందే.

![]() |
![]() |