![]() |
![]() |

'విజయ్' (Vijay)తన పొలిటికల్ పార్టీ 'తమిళగ వెట్రి కజగం'(TVK)కి సంబంధించిన సభని,ఇటీవల 'కరూర్'(Karur)జిల్లా కేంద్రంలో నిర్వహించగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అత్యంత దారుణమైన ఈ సంఘటనలో నలభై ఒక్క మంది మృత్యువాత పడగా, ఎనభై మంది దాకా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్న వాళ్ళు ఉండటం, ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిచి వేస్తుంది. తొక్కిసలాటకి విజయ్ నిర్లక్ష్యమే కారణమని అధికార 'డిఎంకె'(DMK)తో పాటు పలు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.
కరూర్ ఘటనపై రీసెంట్ గా విజయ్ స్పందిస్తు ఇలాంటి బాధాకరమైన పరిస్థితిని నా జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు. తొక్కిసలాట నన్ను ఎంతగానో బాధించింది. దురదృష్టకరమైన ఘటన జరగకుండా ఉండాల్సింది. అభిమానులు నన్ను నేరుగా చూసేందుకు పెద్ద సంఖ్యలో సభా స్థలికి చేరుకున్నారు..వారి ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటానను. త్వరలోనే కరూర్ బాధితులను పరామర్శిస్తాను. ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. నిజాలు నెమ్మదిగా బయటకు వస్తాయని విజయ్ అన్నారు. ఇందుకు సంబంధించి విజయ్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
![]() |
![]() |